Sunday, January 15, 2012

dana veera sura karna ప్రాయోపవేశం - మహాభారత ఘట్టం (దానవీర శూర కర్ణ చలనచిత్రం లోని నందమూరితారక రామారావుగారి స్వర విన్యాసం పదాలలో...)


ప్రాయోపవేశం
(ద్రౌపది పరిహాసపూరిత నవ్వుని పరి పరి విధముల తలచుకుంటూ, బాధపడుతూ.....)
పాంచాలీ.......... పంచ భర్తృక,........ఏమే....ఏమేమే.... నీ ఉన్మత్త వికటాట్టహాసము?.....ఎంత మరువయత్నించిననూ మరపునకురాక, హృదయశల్యాయమానములైన నీ పరిఅహాసారావములే నా కర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాసిజనితరాకాసుధాకరవరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రీయ పరిపాలిత భరతసామ్రాజ్య మహోత్తమక్షత్రీయ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్యప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వరపదాభిరస పరసురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీయుండైన రాధేయునకు మిత్రుండనై, మాన ధనుడనై మనుగడ సాగించునన్నుచూచి..... ఒక్క ఆడుది పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా.... అహో తన పతులతో తుల్యుడనగునన్ను బావగా సంభావింపక, సమ్మానింపక, గృహిణీధర్మ పరిత్యక్తయై, లజ్జావిముక్తయై ఆ పంథకి ఎట్ట యెదుట ఏల గేలిసేయవలె?..... అవునులే..... ఆ వయసుమాలిన భామకు యెగ్గేమి, సిగ్గేమి? వంతు వంతున మగని ముందొక మగనిని వచ్చల పర్యంతము రెచ్చిన కడు పిచ్చితో పచ్చి పచ్చి వైభవమున కేళించు ఆలి గేలి సేసిన మాత్రమున హఁ.... హఁ.... మేమేల కటి కట పడవలె? ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానమునతో మోరెత్తి కూతలిడునా... అని సరిపెట్టుకుందునా...?
హఁ ఈ లోకం మొయ్య మూకుడుండునా.........!? అయిననూ.... దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి .... హఁ.... నేనేల రావలె? వచ్చితిమిఫో......! ఇధి రత్న సభాసోపేతమై సర్వతృ సంశోభితమైన ఆ మయసభ మాకేలవిడిది కావలె? అయినది ఫో... సజీవ జలచర సంతాన వితాలకాలాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలె?... మోపితిమిఫో... సకల రాజన్య కోఠీరకోఠీ తగోషిప్తరత్నప్రభానీరాజితమగు మా పాదపద్మమేల అపభ్రంశమొందవలె? ఏ తస్సమయమునకే పరిచారికా పరివృతయైన ఆ పాతకి పాంచాలి ఏల రావలె? వీక్షించవలె? పరిహసించవలె?.... హఁ....ధిక్....హఁ...ధిక్....హఁ....హతవిధి... ఆజన్మశతృవులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బదబానల జ్వాలలు ధగ్ధమొనర్చుచున్నవి మామా....
విముఖుని సుముఖుని చేసి మమ్మచటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేషవిభవాధిక్యములు ఏమైనవి మామా?.... పాంచాలీ కృతావమాన మానుడనై మానాభిమాన వర్జితుదనై... మర్యాదాతిక్రమణముగా మనుటయా...? పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయాఁ....? నిస్సీ... ఆడుదానిపై పగ సాగింపలేక అసు పరిత్యాగముగావించినాడన్న అపఖ్యాతి ఆ పై వేరొకటియా?.. ఏదీ కర్తవ్యము?

No comments:

Post a Comment