వేదం
వేదం సకల శాస్త్రాల సమాహారం
మనిషి పుట్టి, పరిపూర్ణ వికాసదసకు చేరుకున్న తరువాత, భూమి మీద తనకు, మిగతా జీవరాసులకు మధ్య తేడా తెలుసుకున్నాడు. పరిపూర్ణ, ఆరోగ్యకర మానవ సమాజం పెరగాలంటే... ఏ విధంగా జీవించాలి? ఏ విషయంలో ఏ విధానం పాటిస్తే మంచిది? అని తెలుసుకుంటూ.... ప్రయోగాలు చేస్తూ...
తన శక్తులు...తన బలహీనతలు తెలుసుకుంటూ.... ప్రకృతి.... పరిసరాలు.....గమనిస్తూ.... తనని తాను కాపాడు కుంటూ...... సహ జీవనం చేసే జీవులను కాపాడుతూ.....అవరోధాలను ఎదుర్కొంటూ, అధిగమిస్తూ........ప్రశాంతమైన, సంతృప్తికర, సుఖమయ జీవనం గడుపుతూ తనతో పాటు నివసిస్తున్న మనుషులు, ఆరోగ్యకర మానవ సమాజ అభివృద్ధి కోసం అన్య జీవరాసుల ఆరోగ్యకర సమాజ అభివృద్ధి కోసం సామాజిక భాద్యతతో....ప్రయోగాలు చేస్తూ... ఆ ప్రయోగాల విశ్లేషణలను వాటి ఫలితాల గమనికలను పద్య రూపంలో పదిలపరుస్తూ తయారు చెసిన ప్రాకృతిక, సనూతన, సనాతన జీవన విధానం అతిపెద్ధ గ్రంధం వేదం.
అప్పటి వారు విఙ్ఞాన పరంగా... చాలాఅభివృద్ధిని సాధించారు. ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో పురాతన కాలంలోనే అన్ని శాస్త్రాలు కనుగొని... సమాజంలో అందరూ మంచిగా ఆలోచించరు గనుక సమాజిక భాద్యత... వ్యక్తిగత భద్యత లేని వ్యక్తులకు వేద విఙ్ఞానం దూరంగాఉంచాలనే ఉద్దేశ్యంతో.... గోప్యంగా ఉంచారు ..... అన్ని శాస్త్రాల విఙ్జానం కలిపి వేదంగా అభివర్ణించారు.
ఈ ఆధునిక శాస్త్రఙ్ఙులు చెప్పినవరకు మనకు తెలిసినది 3 Dimentions మాత్రమే. కానీ మ పురాణాలను గమనిస్తే 14 Dimentions కనిపిస్తాయి. మన పూర్వీకులు పరగ్రహాంతర వాసులను కలవటం జరిగింది. మన పూర్వీకులు గ్రహాంతర ప్రయాణం కూడా చేసారని పురాణ గాధలు చెబుతున్నాయి. వైద్య శాస్త్రంలో కూడా అసామాన్యమైన ప్రగతి సాధించారు.
మరణించినవారిని ఔషధాలతో బతికించారని కూడా మన పురాణాలలో చెప్పబడింది. మరణించినవారిని ఔషధాలతో బతికించారని కూడా మన పురాణాలలో చెప్పబడింది. కాంతి, శబ్ధ, స్పర్శల ద్వారా ఏ విధంగా శారీరిక, మానసిక బాధలు అధిగమించ వచ్చో చెప్పబడింది.
మనిషి పుట్టిన నాటినుండి....ఆరోగ్యకర జీవనవిధానం.....ఆరోగ్యకర వ్యక్తిగత జీవనం గడపడం, ఆరోగ్యకర సామాజిక జీవనవిధానం..... ఏమి తింటే ఎక్కువకాలం ఆరోగ్యంతో బ్రతుకుతాం అన్ని విషయాలు కులంకషంగా చెప్పబడింది. ఇప్పుడు meidcal science కి ఒక great challenge brain transplantation. కాని నాటి కాలంలోనే ఈ brain transplantation గురించి చాలా పురాణ గాధలలో ప్రస్తుతించారు.
ఉదా: విశ్వామిత్రుడు రాజర్షి బ్రహ్మర్షి కావాలంటే శరీరం మార్చుకురావాలని దేవగురువు చెప్పటంతో సూర్యభగవానుని ద్యానించి దేహం తమింపచేసుకుని కొత్తశరీరంతో వచ్చి బ్రహ్మర్షి అవుతాడు.
నేడు మనిషి గొప్ప ఆవిష్కరణలు అని జబ్బలు చరుచు కుంటున్న ఆవిష్కరణలు
1) artificial insemination
2) cloning
ఇటు వంటి ఆవిష్కరణలు అద్భుతాలు మన పురాణాలలో ఎక్కడపడితే అక్కడే వింటుంటాం.
ఆవిష్కరణలు అద్భుతాలు గురించి మాత్రమే కాకుండా.... ఈ అద్భుత ఆవిష్కరణలు మూర్ఖుల చేతిలో పడితే ఎంత అనర్ధమో కూడా కథలరూపంలో పురాణ రూపంలో వివరింపబడింది.
ఇంత విస్తారంగా వున్న వేదాన్ని వర్ణించపూనడంసాహసమే. కాని ఆ శ్రీ గురుని ఆశీర్వదబలంతో వేదం ఆధునిక మానవ జీవనానికి ఏ విధంగా ఉపయోగకరమో చెప్ప ప్రయత్నిస్తాను.
ఈ సనాతన సాంప్రదాయం అన్ని కాలాలలో మనిషి అనే జీవి వున్నంతవరకు ఉపయోగకరమే.
ఐతే దురదృష్టవశాత్తు రాముని వంశస్తులనుండి ఎప్పుడైతే రాజ్యాధికారం దూరమైందో.... క్రమంగా అన్య మతాలు పుట్టుకొచ్చాయి
వేదం పరిపూర్ణ మానవ, వైయక్తిక మరియు సామాజిక మనోవిజ్ఞాన వికాస, సకల శాస్త్ర సముదాయం.
సనాతన సాంప్రదాయం అన్ని రకాలుగా అన్ని సమయాలలోను, అన్ని కాలాలలో.... మానవజాతి మనుగడను....మా'నవ'జాతి అభివృద్దికి.... సంపూర్ణ, పరిపూర్ణ మనో విజ్ఞాన వికాస శాస్త్రం, విజ్ఞాన వికాస శాస్త్రం. అని చెప్పటంలో ఎటువంటి సందేహంలేదు.
ముందుగా ప్రతీ మనిషి తాను ఎవరు? ఏమిటి? అందుకు బ్రతుకుతున్నాడు అని తెలుసు కోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికి, అందరికీ ఉంది.
మన పూర్వీకులు ఎంతో భాద్యతతో ఆరోగ్యకర, ఆనందకరమైన భావి సమాజాన్ని(వారి తరువాత తరం కోసం అంటే మన కోసం) నిర్మించాలి అనే గొప్ప సంకల్పంతో జాగ్రత్తతో... జాగరూకతతో, భాద్యతతో, ప్రేమతో ప్రవర్తించి, కష్టాలన్నీ వారే అనుభవించి... అటువంటి కష్టం తరువాత తరాలు అనుభవించ కూడదని ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవనం గడపాలని ఎన్నో ఆవిష్కరణలు చేసి, ఒకరి ఆవిష్కరణలు ఒకరికి ఒకరు పంచుకుని మనజీవితాలు సుఖమయం చేసారు, ఆనందమయం చేసారు మనకి ఈ సాంప్రదాయ కర జీవితాన్ని ఇచ్చారు.
అంతే కాదు మనకి ఒక భాద్యత ఇచ్చారు. అదేమిటంటే మనం మనకి ఇటువంటి ఆనందకర జీవితాన్ని అనుభవిస్తూ ఇటువంటి ఆనందకర జీవితాన్నిచ్చిన పెద్దలను వారి ముసలితనంలో ఆసరాగా నిలబడటం... మనతరువాత తరాలకు ఆరోగ్యకర, ఆనందకరమైన జీవితాన్ని , ఆరోగ్యకర, ఆనందకరమైన మరియు ధృఢమైన మనస్సుని, సాంప్రదాయాన్ని వారసత్వ సంపదగా ఇవ్వాలి.
కానీ...... నేటి సమాజంలో చాలా మంది ఏం చేయాలో తెలియకుండా ఎందుకు బ్రతుకుతున్నారో తెలియకుండా జీవితం గడుపుతున్నారు. ఆనందిస్తున్నాం అనే మత్తులో, భ్రమలో సామాజిక మానవ జంతువులలా జీవితం వెళ్ళదీస్తున్నారు. అసలు నేటి సమాజంలో చాలామంది మాకు స్వేచ్చ లేదు అనుకుంటూ బ్రతకేయటం పరిపాటి అయిపోయింది. దీనికి కారణం సగం సగం ఙ్ఞానం అర్దంలేని మితిమీరిన పరిఙ్ఞానం కలిగి ఉండి, భషా ఙ్ఞానం, ఇంగిత ఙ్ఞానం శూన్యం అవటం కూడా. అందుకే ముందుగా మన తెలుగులో కొన్ని వాడుక పదాలు వాటి అర్దం తెలుసుకుందాం
మంచి
మంచి అంటే... సమాజానికి ఉపయోగపడే పని,
చెడు అంటే... సాటి మనిషికి గాని, సమాజానికి కీడు చేసేపని
నేడు కొంతమంది నీ మంచివేరు నా మంచి వేరు అంటున్నారు స్వార్దానికి మంచి అనిపేరుపెడితే నీ మంచివేరు నా మంచి వేరు అనాల్సివస్తుంది.
తెలుగు తెలిసిన ప్రతీవాడి నోటిలో ఉండే ఒకే ఒక చెత్త పదం "పాపం". అయ్యోపాపం.... అలాగా పాపం.....అలా అయిందట పాపం... అంతా..... పాపం.
ఈ పాపం అన్న పదం మన భాషా సంస్కృతిలోనిది కాదు వాడకూడని పదం. ఈ పదం ఎక్కడినుండి వచ్చింది? తెలుసుకుందాం.......
తెల్లవాడు. వాడి మతం భారతీయులకి అంట గట్టి, భారతీయులంటే చిన్న చూపుతో భారతీయులకి అంటగట్టిన పదం.
ఏదైనా కష్టం వచ్చినప్పుడు భారతీయులు అయ్యోరామా అనుకోవటం పరిపాటి. ఎందుకంటే దర్మ పరిరక్షణ కోసం, భాద్యతకోసం రాముడు పడ్డ కష్టం ముందు నా కష్టం ఏ పాటిదిలే అని రాముని తలచుకుని సొంత కష్టాన్ని మరిచిపోతాం. రామునిలో మంచి లక్షణాలు అలవడతాయి అని రాముని తలచు కుంటాం
అదే క్రిష్టియన్స్ (తెల్లదొరలు) ఐతే జీసస్ క్రైష్ట్ అని తలచు కుంటారు. శాంతికోసం ప్రేమ పంచటం కోసం జీసస్ పడ్డ కష్టం ముందు నా కష్టం ఏ పాటిదిలే అని జీసస్ పడ్డ కష్టం తలచుకుని సొంత కష్టాన్ని మరిచిపోతారు. జీసస్ చెప్పిన మంచి మాటలు తలచు కొంటే మంచి లక్షణాలు అలవడతాయి అని జీసస్ ని తలచుకుంటారు.
కానీ భారతీయులు పాపాత్ములు అని పాపాన్ని తలచుకొమ్మని పాపం అన్న మాట తలచుకొన్న ప్రతీసారీ వారు మరింత పాపాత్ములుకావాలన్నది వారి అభి మతం. భారతీయులకు మతంమార్చి, పాపం అనే మాట నేర్పించారు. వారు మాత్రం ఆ పదంవాడరు. ఇది అంతా చదివిన తరువాత అసలు పాపం అంటే ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా...............? తెలుసుకోండి ఇక్కడ.
కార్యం అంటే ఆరోగ్యకర మానవసమాజ అభివృద్ది కోసంచేసేటతువంటి ప్రయత్నం
పొరపాటు.....తప్పు......పాపం మూడు ఒకే చర్యలా కనిపిస్తున్నా కూడా భావన, ప్రవర్తనా, భావప్రవర్తనా సంభదమైన అంశం అర్ధం కలిగి ఉన్నపదాలు.
ప్రతీమనిషి కార్యాచరణలో నేర్చుకునే క్రమంలో కొన్ని తప్పిదాలు జరుగు తూ ఉంటాయి ఈ విధమైన తప్పిదాలు మూడు రకాలు. తెలియక చేసినవి, తెలిసిచేసినవి, ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి.
పొరపాటు అంటే తెలియక చేసిన కార్యవిఘాతం కలిగించే చర్య.
తప్పు అంటే తెలిసిచేసినా తెలిసి చేసినా తెలియక చేసినా
సరిదిద్దుకోగలిగేటతువంటి కార్యవిఘాతం కలిగించే చర్య.
కాని,
పాపం అంటే తెలిసి చేసినా తెలియక చేసినా, ఉద్దేశ్యపూర్వకంగా చేసినా సరిదిద్దుకోలేనటువంటి కార్యవిఘాతం కలిగించే చర్య.
ఉద్దేశ్యపూర్వకంగా సరిదిద్దుకోలేనటువంటి సరిదిద్దడానికివీలు కానటువంటి కార్యవిఘాతం చేస్తే అది మహాపాపం
కనుక, మితృలారా.... జాలిచూపడానికి పాపం అనేపదం వాడనవసరంలేదు.
No comments:
Post a Comment