Friday, February 28, 2025

Sanathanam

 🔔 సనాతనం 🔔

మూఢనమ్మకం కాదు శాస్త్రీయజీవనవిధానం

"ఇసోఫెగస్" (Esophagus )_*అన్నవాహిక

 -అనేది మన గొంతుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబు. ఇది కండరాలతో నిర్మితమై వుండి, ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. ఆహారం లోనికి తీసుకునేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి. అలా మూసుకుని జీర్ణాశయంలో ఉన్న ఏసిడ్, ఆహారాలను బయటకు రాకుండా ఆపి రక్షిస్తూ ఉంటుంది. ఏసిడ్ బయటకి లీక్ అయ్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాము.

భోజనం చేసే ముందు ఈ ఎసోఫెగస్  సాఫీగా తెరుచుకోవడానికి బ్రాహ్మణులు చేసే "ఆచమనం" అనే పద్దతిని అందరూ పాటించాలి. పరిశీలిస్తే ఈ ఆచమనం అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్ఠితో అలవరచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది. కొందరు అనుకున్నట్టు ఒక మూఢాచారం కాదు. కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలుపెడితే  ఎసోఫెగస్‌కి లూబ్రికేషన్ జరుగుతుంది, ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది. అంతేనా? ఆలాగైతే ముందుగా కాస్త నీళ్ళుతాగి భోజనం చెయ్యమని చెప్పచ్చుగా? కేశవ నామాలు దేనికి అని అనుమానం రావచ్చు. ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు, ఏ పూజచేసేటప్పుడైనా కూడా చేస్తారు.   అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెసుని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. 


గొంతులో ఎసోఫెగస్ ఒక్కటే కాదు. సున్నితమైన శ్వాసనాళము, స్వరతంతంత్రులు వంటివి అనేకం ఉంటాయి. మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్ధిష్థపద్దతిలో వ్యాయామం (వార్మ్ అప్) అవసరం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు. అదీ ఏ నామం పడితే అది అని చెప్పలేదు. కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు.


ఎందుకంటే, "కేశవ" నామం గొంతులోనుంచీ వస్తుంది. "నారాయణ" నామం నాలిక సహాయంతో వస్తుంది. "మాధవ" నామం పెదాల సహకారంతో వస్తుంది.  అంటే నోటిలో అన్ని భాగాలకూ ఒక ఎక్సర్సైజు అన్న మాట.

మరి నీళ్ళు చేతిలో పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి? ఉద్ధరిణితో నేరుగా నోట్లో పోసుకోవచ్చుకదా? మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్తు (స్టాటిక్ పవర్) ఉంటుంది. ఆ చేతితో నీరు పోసుకుని మింగితే, దానితో చేతిలో ఉన్న విద్యుత్తు, నోటిలోకి పొట్టలోకి ప్రవహించి  అన్నిటినీ ఉత్తేజపరచి, సమతుల్యం చేస్తుంది. దానితో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది. అలాగే కంఠంలో ఉన్న స్వరతంతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయి. ఇది ఒక దృక్పదం. కొందరు మరొక విధంగా చెప్పవచ్చు. కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత (మనకి పూర్తిగా అర్థం కాకపోయినా) కనిపిస్తుంది.

ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు. వస్తాయి. రావాలి. ఐతే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరుకకపోవచ్చు. అంటే దాని వెనుకనున్న నాలెడ్జిని మనం కోల్పోయాము. కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే, సమాధానాలు అన్నీ ఒకరోజుకి దొరుకుతాయి.


PS: ఒక శాస్త్రీయ విధానాన్ని సింపులుగా మూఢనమ్మకం అని కొట్టేయడాన్ని మించిన మూఢనమ్మకం మరొకటి వుండదేమో.!


Friday, March 31, 2023

పేదరాశి చిట్టెమ్మ

 పేదరాశి చిట్టెమ్మ పేదరాశి పెద్దమ్మ మనవరాలు  రాస్తున్నా ....

అన్నీ  పేదరాశి పెద్దమ్మ పోలికలే 

question 1: మీ ప్రత్యేకతలు ఏంటి?

answer: పేదరాశి పెద్దమ్మ  మైక్రోసాఫ్ట్ ప్రొసెసర్అ యితే నేను apple processor లెఖ్ఖ 

wow ... super 

question 2: పేదరాశి పెద్దమ్మ చెయ్యనివి మీరేం చేస్తారు 

Answer :   పేదరాశి పెద్దమ్మ కధలు చెబుతుంది వంటలు వండుతుంది అంతే ....

మరి నేను వంటకాల్లో ప్రయోగాలు చేస్తాను పాటలు పాడుతాను పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను కథలు కూడా  చెబుతాను పాఠాలు చెబుతాను 

question అబ్బోఓ,,,ఏమి పాటలు పడతారు ?

మంగుళూరు ముకుందం .... song 

question:  బాగుంది... మరీ ...  వంటకాలు ప్రయోగాలు ఏమి చేస్తారు ?

పిండివడియాన్నీ  మాడుబెల్లంలో కలిపి ఎండబెట్టి ముచ్చులో చుట్టి fridge లో పెడితే చాక్లెట్ 

చేగోడీలని నలగ్గొట్టి ఎండబెట్టి గాలి కొట్టి పొట్లం చుడితే kurkure లు ఇంకా ఇలా చాలా చేసాను 

question: మరి పిల్లలకి   ఎం సమాధానాలు చెబుతారు?

పేదరాశి చిట్టెమ్మ:  నాయనా (ఒక పిల్ల వాడి వైపు చూపిస్తూ) నీ కేమైనా ప్రశ్నలు ఉన్నాయా 

పిల్లవాడు: నేను పెద్దవాళ్ల కాళ్లకు ఎందుకు నమస్కారం చెయ్యాలి 

చిట్టెమ్మ: మీ ఇంట్లో తల్లి తండ్రులు నిన్ను అమితంగా ప్రేమిస్తారు నీ అభివృద్ధి కోరుకుంటారు ఈ ఆలోచనలన్నీ మెదడులో జరుగుతాయి అలా మెదడులో జరిగే చర్యలు కాళ్ళు వేళ్ళు మరియు చేతుల వేళ్ళు నుండి శక్తి రూపేణా బయటకు వస్తాయి. ఈ మంచి భావనలు వారిలో ఉన్నప్పుడు నువ్వు వారి ఆశీర్వాదం స్వీకరించడానికి సిద్ధంగా ఉండి   కాళ్ళను  స్పృశిస్తే వారు  వారి చేతులతో నిన్ను  స్పృశిస్తారు అప్పుడు వారి మంచి భావనల శక్తి నీలో చేరి నీకు మంచి చేస్తుంది. అందుకు నువ్వు నీ తల్లి తండ్రుల పాదాలకు నమస్కారం చెయ్యాలి.

question: మరి పాఠాలు చెబుతాను అన్నారు. 

చిట్టెమ్మ : ఇందాక చెప్పిన సమాధానం లో సమాధానం ఉంది పాఠం కూడా ఉంది అయినా  ఇక్కడ రాజీవ్ మహోదయ అత్యద్భుతంగా సంస్కృత పాఠాలు చెబుతున్నారు ఆయన కన్నా గొప్పగా చెప్పలేను. కానీ నేను చాలా బిజీ అమ్మడు  

 


Thursday, March 30, 2023

pittala dora పిట్టల దొర

పిట్టల దొర 

 హలో హలొ హలొ ఎలా ఉన్నారు అందరు ?

हरी ॐ हरी ॐ हरी ॐ सर्वे कथं सन्ति 

సంస్కృతం క్లాసు మధ్య లో వీడెవడు అని లో చిస్తున్నారా.

संस्कृत कक्षा मध्ये एषः कह इति चिंतयंतिवा  

నా పేరు పిట్టలదొర. నమ్మట్లేదా ఎందుకు నమ్మట్లేదు?

मां नाम पित्तलदोरा विश्वासम न कुर्वन्ति वा कीमारधाम न विस्वासम न कुर्वन्ति ?

పిట్టలదొర కి తుపాకీ లేదు అనే కదా ఆలోచిస్తున్నారు?

 मम समीपे भीशुण्डि नास्ति इति कारणेन किला 

నాతుపాకీని పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధానికి అప్పు అడిగాడు

म म  भीशुण्डीं पुतिन उक्रैन युध्धा निमित्तं रुनरूपेण स्वीकृतवान   

నా తుపాకీ పనితనానికి మెచ్చి 5 కోట్లు ఇచ్చాడు 4 కోట్లు ఇంట్లో ట్రంకు పేటలో పెట్టాను ఒకటి నేను ఏసుకోచ్చాను.

म म  भिक्षुण्ड्याः कार्यं दृष्ट्वे पंचा कोटलू दत्तवान चत्वारी कोटलू  ट्रंकास्य  गृहे पेटिकायाम स्थापितावान  एकम धृत्वा आगतवान 

ఆ మధ్యన చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చాడు 

तदा चन्द्रः भूमि समीपे आगतवान 

అప్పుడు చంద్రమండలం ప్రధానమంత్రి  నన్ను టీ పార్టీకి పిలిచాడు 

तदा चंद्र मंडलस्य मुख्या मंत्री माम चाय पाना निमित्तं आहुतावान 

మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు చంద్రమండలం ప్రధానమంత్రి కి బాగా నచ్చి

अस्माकं भारतीय संस्कृति साम्प्रदायानी चंद्र मंडलस्य मुख्या मंत्रिम  बहु रोचितम  

చంద్ర మండలం ప్రధానమంత్రి కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు 

अतः सः  तस्य पुत्रीम दत्त्वा विवाहं करोमि इति  उक्तवान 

రష్యా ఉక్రెయిన్ యుద్ధం रस्या उक्रैन  युद्दाम स्थगायित्वा ఆపి మళ్ళీ వస్తాను पुनः आगच्छामि అని ఇస్రో రీ యూజబుల్ సాటిలైట్ లో इति  उपग्रहेण आगच्छामि   మణికొండ మీదుగా मणिकोण्डा उपरीतः अदहा కిందికి వస్తుంటే आगच्छामि  आगमन समाये గోల్డెన్ టెంపుల్ గోపురం स्वर्ण मन्दिरस्य गोपुरस्य కాంతి బాగుందని कांतिम द्रुस्त्वा  सम्यक अस्थि इति अदहा अवतरणे కిందికి దిగుతుంటే ఎదో తగిలి కింద పడ్డా. किमपि स्पर्शा भूत्वा अदहा पतितवान  ఏందిరా అని చుస్తే किम अस्ति इति  पश्यामि चेत హనుమంతులవారి తోక आंजनेयस्य पृच्छः आसीत्ఇ క్కడअत्रा  ఈయనేం చేస్తున్నాడ్రా అని చుస్తే एषः किम करोति इति चिन्तितवान  ఇక్కడ శ్రీ రాములోరి కల్యాణ మహోత్సవం జరుగుతుంది अत्र  श्री रामस्य कलयाण महोत्सवम प्रचलति . ఎక్కడైతే రాములోరిని భక్తిగా పూజిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడు గదా यात्रा रामस्य भक्त्या  पूजा भवति तत्र आंजनेय सर्वदा तत्र भवति तिला तस्मै नमामि अहम्  ఆయనకీ ఓ దండం పెట్టి ఇంకో వైపు చుస్తే శ్రీ రాముణ్ణి సంస్కృత శ్లోకాలతో పూజిస్తున్నారు. अपरस्मिन भागे पस्यामि चेत तत्र

 रामम , संस्कृत स्लोकैः पूजां  कुर्वन्ति। 

చాలారోజులకి శ్రావ్యమైన సంస్కృతం విన్న ఆనందంతో बहु कालानांतरम  सुंदर संस्कृत भाषा श्रुत्वा आनंदना अत्र   तत्र दृश्टवान  चेत  అటు ఇటు చుస్తే ఎవరో ఇక్కడ రాజీవ్ మహోదయ कश्चना राजीव महोदय గత పది రోజులనుండి गत देश दिन आरभ्य సంస్కృత పాఠాలు అద్భుతంగా నేర్పిస్తున్నారు అని తెలుసి ఇలా వచ్చాను.संस्कृत कक्षः उत्तम तया पाठ यति इति ज्ञात्वा एवं आगतवान 

రాజీవ్ మహోదయ సులభంగా సంస్కృతం నేర్పిస్తున్నారు  మీరందరు సంస్కృతం ఇంత ఆనందంగా నేర్చు కుంటున్నారు .

राजीव महोदय सुलभतया सरला तया अभिनय साहायेना पाठयति,  भवन्तः सर्वे एतावत आनंदेना पठन्ति 

నాకు చంద్ర మండలం ప్రధానమంత్రి నుండి ఫోన్ వచ్చింది మళ్ళీ కలుస్తాను ఉంటాను  

मम कृते  चंद्र मंडलस्य मुख्या मंत्री द्वारा चलवाणी आगता गन्तव्यमस्ति  पुनर्मिलामी 

जय श्री राम 

Saturday, March 5, 2022

Happy Womens day

ओ मेरी माँ आत्मा। 

बेटी सी परि उत्तमा।  

बहन जैसी दोस्ती कहाँ। 

दोस्ती की है तू आस्था। 

नाता और  रिश्ता की है तू परिपूर्णता। 

जिंदगी की आसरा बन के आई तू देवता। 


कैसे मैं  तुझको कृतज्ञ्यता प्रकट करू 

सोचते सोचते जब दिमाग में सोच कम पड़ गए 

तो दिल ने बोला तुझ को कैसे मैं सोचू  तुझे कैसे मै  पुकारू

शीश झुकाके सिर्फ इतना ही कह सकूँ। 


प्रकृती के रूप है तू। 

प्यार की है प्रेरणा  तू। 

प्रेरणा की आत्मा है तू। 

गुरु के आदि गुरु माँ है तू। 

परिवार की संवृद्धि है तू। 

दुनिया केलिए भगवान की आशीर्वाद रूप हैं।  हे स्त्री महान है तू । 


मनुष्य जीवन की पहली खूबसूरत नजारा माँ हैं तू 

दुनियां मैं सबसे ताजा खुशी मन में महकाने वाली बेटी है तू 

माँ पापा दोनों का प्यार दिखाती नादान अनमोल बहन है तू 

आदि भौतिक रूप से - आत्मा बनजाने तक जीवन सफर में 

आजन्मान्तर भाग्य  स्वामिनी बनकर जीवन को सफल बनाने वाली दोस्त है तू। 


ओमकार (अ  + उ + माँ) के आत्मा तुझे  प्रणाम 

भगवान का रूप दाता...तुझ को प्रणाम ...

प्राण दाता प्रणाम 

प्रणाम के परिणाम स्वरूपा तुझ को प्रणाम।


ఆది భౌతికం నుండి ఆత్మగా మారే ఈ జీవన ప్రయాణం లో 

అమ్మ గా కూతురిగా సహోదరిగా స్నేహితురాలిగా ఆజన్మాంతర భాగస్వామిని గా 

జీవనసాఫల్యతని, జీవితానికి పరిపూర్ణతని ఇచ్చే దేవతా నీకు హృదయపూర్వక  ప్రణామం.

ప్రణామ సాఫల్య ప్రతిరూపమా నీకు శిరసా ప్రణామం. 


Friday, June 22, 2012

వేదం

వేదం
వేదం పురాతన శాస్త్రీయ విఙ్ఞానం. మొట్టమొదటి పురాతన ఆధునిక వైఙ్ఞానిక హైందవ నాగరిక జీవన విధానం

వేదం సకల శాస్త్రాల సమాహారం

మనిషి పుట్టి, పరిపూర్ణ వికాసదసకు చేరుకున్న తరువాత, భూమి మీద తనకు, మిగతా జీవరాసులకు మధ్య తేడా తెలుసుకున్నాడు. పరిపూర్ణ, ఆరోగ్యకర మానవ సమాజం పెరగాలంటే... ఏ విధంగా జీవించాలి? ఏ విషయంలో ఏ విధానం పాటిస్తే మంచిది? అని తెలుసుకుంటూ.... ప్రయోగాలు చేస్తూ...

తన శక్తులు...తన బలహీనతలు తెలుసుకుంటూ.... ప్రకృతి.... పరిసరాలు.....గమనిస్తూ.... తనని తాను కాపాడు కుంటూ...... సహ జీవనం చేసే జీవులను కాపాడుతూ.....అవరోధాలను ఎదుర్కొంటూ, అధిగమిస్తూ........ప్రశాంతమైన, సంతృప్తికర, సుఖమయ జీవనం గడుపుతూ తనతో పాటు నివసిస్తున్న మనుషులు, ఆరోగ్యకర మానవ సమాజ అభివృద్ధి కోసం అన్య జీవరాసుల ఆరోగ్యకర సమాజ అభివృద్ధి కోసం సామాజిక భాద్యతతో....ప్రయోగాలు చేస్తూ... ఆ ప్రయోగాల విశ్లేషణలను వాటి ఫలితాల గమనికలను పద్య రూపంలో పదిలపరుస్తూ తయారు చెసిన ప్రాకృతిక, సనూతన, సనాతన జీవన విధానం అతిపెద్ధ గ్రంధం వేదం.

అప్పటి వారు విఙ్ఞాన పరంగా... చాలాఅభివృద్ధిని సాధించారు. ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో పురాతన కాలంలోనే అన్ని శాస్త్రాలు కనుగొని... సమాజంలో అందరూ మంచిగా ఆలోచించరు గనుక సమాజిక భాద్యత... వ్యక్తిగత భద్యత లేని వ్యక్తులకు వేద విఙ్ఞానం దూరంగాఉంచాలనే ఉద్దేశ్యంతో.... గోప్యంగా ఉంచారు ..... అన్ని శాస్త్రాల విఙ్జానం కలిపి వేదంగా అభివర్ణించారు.

ఈ ఆధునిక శాస్త్రఙ్ఙులు చెప్పినవరకు మనకు తెలిసినది 3 Dimentions  మాత్రమే. కానీ మ పురాణాలను గమనిస్తే 14 Dimentions  కనిపిస్తాయి. మన పూర్వీకులు పరగ్రహాంతర వాసులను కలవటం జరిగింది. మన పూర్వీకులు గ్రహాంతర ప్రయాణం కూడా చేసారని పురాణ గాధలు చెబుతున్నాయి. వైద్య శాస్త్రంలో కూడా అసామాన్యమైన ప్రగతి సాధించారు.
మరణించినవారిని ఔషధాలతో బతికించారని కూడా మన పురాణాలలో చెప్పబడింది. మరణించినవారిని ఔషధాలతో బతికించారని కూడా మన పురాణాలలో చెప్పబడింది. కాంతి, శబ్ధ, స్పర్శల ద్వారా ఏ విధంగా శారీరిక, మానసిక బాధలు అధిగమించ వచ్చో చెప్పబడింది. 


మనిషి పుట్టిన నాటినుండి....ఆరోగ్యకర జీవనవిధానం.....ఆరోగ్యకర వ్యక్తిగత జీవనం గడపడం, ఆరోగ్యకర సామాజిక జీవనవిధానం..... ఏమి తింటే ఎక్కువకాలం ఆరోగ్యంతో బ్రతుకుతాం అన్ని విషయాలు కులంకషంగా చెప్పబడింది. ఇప్పుడు meidcal science కి ఒక great challenge brain transplantation. కాని నాటి కాలంలోనే ఈ brain transplantation గురించి చాలా పురాణ గాధలలో ప్రస్తుతించారు.

ఉదా: విశ్వామిత్రుడు రాజర్షి బ్రహ్మర్షి కావాలంటే శరీరం మార్చుకురావాలని దేవగురువు చెప్పటంతో సూర్యభగవానుని ద్యానించి దేహం తమింపచేసుకుని కొత్తశరీరంతో వచ్చి బ్రహ్మర్షి అవుతాడు.


నేడు మనిషి గొప్ప ఆవిష్కరణలు అని జబ్బలు చరుచు కుంటున్న ఆవిష్కరణలు
1) artificial insemination
2) cloning
 ఇటు వంటి ఆవిష్కరణలు అద్భుతాలు మన పురాణాలలో ఎక్కడపడితే అక్కడే వింటుంటాం.
ఆవిష్కరణలు అద్భుతాలు గురించి మాత్రమే కాకుండా.... ఈ అద్భుత ఆవిష్కరణలు మూర్ఖుల చేతిలో పడితే ఎంత అనర్ధమో కూడా కథలరూపంలో పురాణ రూపంలో వివరింపబడింది. 
ఇంత విస్తారంగా వున్న వేదాన్ని వర్ణించపూనడంసాహసమే. కాని ఆ శ్రీ గురుని ఆశీర్వదబలంతో వేదం ఆధునిక మానవ జీవనానికి ఏ విధంగా ఉపయోగకరమో చెప్ప ప్రయత్నిస్తాను. 

ఈ సనాతన సాంప్రదాయం అన్ని కాలాలలో మనిషి అనే జీవి వున్నంతవరకు ఉపయోగకరమే.  
ఐతే దురదృష్టవశాత్తు రాముని వంశస్తులనుండి ఎప్పుడైతే రాజ్యాధికారం దూరమైందో.... క్రమంగా అన్య మతాలు పుట్టుకొచ్చాయి
వేదం పరిపూర్ణ మానవ, వైయక్తిక మరియు సామాజిక మనోవిజ్ఞాన వికాస, సకల శాస్త్ర సముదాయం.
సనాతన సాంప్రదాయం అన్ని రకాలుగా అన్ని సమయాలలోను, అన్ని కాలాలలో.... మానవజాతి మనుగడను....మా'నవ'జాతి అభివృద్దికి.... సంపూర్ణ, పరిపూర్ణ మనో విజ్ఞాన వికాస శాస్త్రం, విజ్ఞాన వికాస శాస్త్రం. అని చెప్పటంలో ఎటువంటి సందేహంలేదు.

ముందుగా ప్రతీ మనిషి తాను ఎవరు? ఏమిటి? అందుకు బ్రతుకుతున్నాడు అని తెలుసు కోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికి, అందరికీ ఉంది. 



మన పూర్వీకులు ఎంతో భాద్యతతో ఆరోగ్యకర, ఆనందకరమైన భావి సమాజాన్ని(వారి తరువాత తరం కోసం అంటే మన కోసం)  నిర్మించాలి అనే గొప్ప సంకల్పంతో జాగ్రత్తతో... జాగరూకతతో, భాద్యతతో, ప్రేమతో ప్రవర్తించి, కష్టాలన్నీ వారే అనుభవించి... అటువంటి కష్టం తరువాత తరాలు అనుభవించ కూడదని ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవనం గడపాలని ఎన్నో ఆవిష్కరణలు చేసి, ఒకరి  ఆవిష్కరణలు ఒకరికి ఒకరు పంచుకుని మనజీవితాలు సుఖమయం చేసారు, ఆనందమయం చేసారు  మనకి ఈ సాంప్రదాయ కర జీవితాన్ని  ఇచ్చారు. 

అంతే కాదు మనకి ఒక భాద్యత ఇచ్చారు. అదేమిటంటే మనం మనకి ఇటువంటి ఆనందకర జీవితాన్ని అనుభవిస్తూ ఇటువంటి ఆనందకర జీవితాన్నిచ్చిన పెద్దలను వారి ముసలితనంలో ఆసరాగా నిలబడటం... మనతరువాత తరాలకు  ఆరోగ్యకర, ఆనందకరమైన జీవితాన్ని , ఆరోగ్యకర, ఆనందకరమైన మరియు ధృఢమైన మనస్సుని, సాంప్రదాయాన్ని వారసత్వ సంపదగా ఇవ్వాలి.




కానీ...... నేటి సమాజంలో చాలా మంది ఏం చేయాలో తెలియకుండా ఎందుకు బ్రతుకుతున్నారో తెలియకుండా జీవితం గడుపుతున్నారు. ఆనందిస్తున్నాం అనే మత్తులో, భ్రమలో సామాజిక మానవ జంతువులలా జీవితం వెళ్ళదీస్తున్నారు. అసలు నేటి సమాజంలో చాలామంది మాకు స్వేచ్చ లేదు అనుకుంటూ బ్రతకేయటం పరిపాటి అయిపోయింది. దీనికి కారణం  సగం సగం ఙ్ఞానం అర్దంలేని మితిమీరిన పరిఙ్ఞానం కలిగి ఉండి, భషా ఙ్ఞానం, ఇంగిత ఙ్ఞానం శూన్యం అవటం కూడా.  అందుకే ముందుగా మన తెలుగులో కొన్ని వాడుక పదాలు వాటి అర్దం తెలుసుకుందాం

మంచి  

మంచి అంటే... సమాజానికి ఉపయోగపడే పని, 
చెడు అంటే... సాటి మనిషికి గాని, సమాజానికి కీడు చేసేపని
నేడు కొంతమంది నీ మంచివేరు నా మంచి వేరు అంటున్నారు స్వార్దానికి మంచి అనిపేరుపెడితే నీ మంచివేరు నా మంచి వేరు అనాల్సివస్తుంది.





తెలుగు తెలిసిన ప్రతీవాడి నోటిలో ఉండే ఒకే ఒక చెత్త పదం "పాపం".   అయ్యోపాపం.... అలాగా పాపం.....అలా అయిందట పాపం... అంతా..... పాపం.

ఈ పాపం అన్న పదం మన భాషా సంస్కృతిలోనిది కాదు వాడకూడని పదం. ఈ పదం ఎక్కడినుండి వచ్చింది? తెలుసుకుందాం.......

తెల్లవాడు. వాడి మతం భారతీయులకి అంట గట్టి, భారతీయులంటే చిన్న చూపుతో భారతీయులకి అంటగట్టిన పదం. 

ఏదైనా కష్టం వచ్చినప్పుడు భారతీయులు అయ్యోరామా అనుకోవటం పరిపాటి. ఎందుకంటే దర్మ పరిరక్షణ కోసం, భాద్యతకోసం రాముడు పడ్డ కష్టం ముందు నా కష్టం ఏ పాటిదిలే అని రాముని తలచుకుని సొంత కష్టాన్ని మరిచిపోతాం. రామునిలో మంచి లక్షణాలు అలవడతాయి అని రాముని తలచు కుంటాం
అదే క్రిష్టియన్స్ (తెల్లదొరలు) ఐతే జీసస్ క్రైష్ట్ అని తలచు కుంటారు. శాంతికోసం ప్రేమ పంచటం కోసం జీసస్ పడ్డ కష్టం ముందు నా కష్టం ఏ పాటిదిలే అని జీసస్ పడ్డ కష్టం తలచుకుని సొంత కష్టాన్ని మరిచిపోతారు. జీసస్ చెప్పిన మంచి మాటలు తలచు కొంటే మంచి లక్షణాలు అలవడతాయి అని జీసస్ ని తలచుకుంటారు. 

కానీ భారతీయులు పాపాత్ములు అని పాపాన్ని తలచుకొమ్మని పాపం అన్న మాట తలచుకొన్న ప్రతీసారీ వారు మరింత పాపాత్ములుకావాలన్నది వారి అభి మతం. భారతీయులకు మతంమార్చి, పాపం అనే మాట నేర్పించారు. వారు మాత్రం ఆ పదంవాడరు. ఇది అంతా చదివిన తరువాత అసలు పాపం అంటే ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా...............? తెలుసుకోండి ఇక్కడ.

కార్యం అంటే ఆరోగ్యకర మానవసమాజ అభివృద్ది కోసంచేసేటతువంటి ప్రయత్నం

పొరపాటు.....తప్పు......పాపం మూడు ఒకే చర్యలా కనిపిస్తున్నా కూడా భావన, ప్రవర్తనా, భావప్రవర్తనా సంభదమైన అంశం అర్ధం కలిగి ఉన్నపదాలు. 

ప్రతీమనిషి కార్యాచరణలో నేర్చుకునే క్రమంలో కొన్ని తప్పిదాలు జరుగు తూ ఉంటాయి ఈ విధమైన తప్పిదాలు మూడు రకాలు. తెలియక చేసినవి, తెలిసిచేసినవి, ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి.


పొరపాటు అంటే తెలియక చేసిన కార్యవిఘాతం కలిగించే చర్య. 

తప్పు అంటే తెలిసిచేసినా తెలిసి చేసినా తెలియక చేసినా 

సరిదిద్దుకోగలిగేటతువంటి కార్యవిఘాతం కలిగించే చర్య.


కాని, 

పాపం అంటే తెలిసి చేసినా తెలియక చేసినా, ఉద్దేశ్యపూర్వకంగా చేసినా సరిదిద్దుకోలేనటువంటి కార్యవిఘాతం కలిగించే చర్య.

ఉద్దేశ్యపూర్వకంగా సరిదిద్దుకోలేనటువంటి సరిదిద్దడానికివీలు కానటువంటి కార్యవిఘాతం చేస్తే అది మహాపాపం

కనుక, మితృలారా.... జాలిచూపడానికి పాపం అనేపదం వాడనవసరంలేదు.


Sunday, January 15, 2012

dana veera sura karna ప్రాయోపవేశం - మహాభారత ఘట్టం (దానవీర శూర కర్ణ చలనచిత్రం లోని నందమూరితారక రామారావుగారి స్వర విన్యాసం పదాలలో...)


ప్రాయోపవేశం
(ద్రౌపది పరిహాసపూరిత నవ్వుని పరి పరి విధముల తలచుకుంటూ, బాధపడుతూ.....)
పాంచాలీ.......... పంచ భర్తృక,........ఏమే....ఏమేమే.... నీ ఉన్మత్త వికటాట్టహాసము?.....ఎంత మరువయత్నించిననూ మరపునకురాక, హృదయశల్యాయమానములైన నీ పరిఅహాసారావములే నా కర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాసిజనితరాకాసుధాకరవరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రీయ పరిపాలిత భరతసామ్రాజ్య మహోత్తమక్షత్రీయ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్యప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వరపదాభిరస పరసురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీయుండైన రాధేయునకు మిత్రుండనై, మాన ధనుడనై మనుగడ సాగించునన్నుచూచి..... ఒక్క ఆడుది పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా.... అహో తన పతులతో తుల్యుడనగునన్ను బావగా సంభావింపక, సమ్మానింపక, గృహిణీధర్మ పరిత్యక్తయై, లజ్జావిముక్తయై ఆ పంథకి ఎట్ట యెదుట ఏల గేలిసేయవలె?..... అవునులే..... ఆ వయసుమాలిన భామకు యెగ్గేమి, సిగ్గేమి? వంతు వంతున మగని ముందొక మగనిని వచ్చల పర్యంతము రెచ్చిన కడు పిచ్చితో పచ్చి పచ్చి వైభవమున కేళించు ఆలి గేలి సేసిన మాత్రమున హఁ.... హఁ.... మేమేల కటి కట పడవలె? ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానమునతో మోరెత్తి కూతలిడునా... అని సరిపెట్టుకుందునా...?
హఁ ఈ లోకం మొయ్య మూకుడుండునా.........!? అయిననూ.... దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి .... హఁ.... నేనేల రావలె? వచ్చితిమిఫో......! ఇధి రత్న సభాసోపేతమై సర్వతృ సంశోభితమైన ఆ మయసభ మాకేలవిడిది కావలె? అయినది ఫో... సజీవ జలచర సంతాన వితాలకాలాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలె?... మోపితిమిఫో... సకల రాజన్య కోఠీరకోఠీ తగోషిప్తరత్నప్రభానీరాజితమగు మా పాదపద్మమేల అపభ్రంశమొందవలె? ఏ తస్సమయమునకే పరిచారికా పరివృతయైన ఆ పాతకి పాంచాలి ఏల రావలె? వీక్షించవలె? పరిహసించవలె?.... హఁ....ధిక్....హఁ...ధిక్....హఁ....హతవిధి... ఆజన్మశతృవులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బదబానల జ్వాలలు ధగ్ధమొనర్చుచున్నవి మామా....
విముఖుని సుముఖుని చేసి మమ్మచటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేషవిభవాధిక్యములు ఏమైనవి మామా?.... పాంచాలీ కృతావమాన మానుడనై మానాభిమాన వర్జితుదనై... మర్యాదాతిక్రమణముగా మనుటయా...? పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయాఁ....? నిస్సీ... ఆడుదానిపై పగ సాగింపలేక అసు పరిత్యాగముగావించినాడన్న అపఖ్యాతి ఆ పై వేరొకటియా?.. ఏదీ కర్తవ్యము?

మయ సభ - మహాభారత ఘట్టం (దానవీర శూర కర్ణ చలనచిత్రం లోని నందమూరితారక రామారావుగారి స్వర విన్యాసం పదాలలో...)


మయ సభ - మహాభారత ఘట్టం
(దానవీర శూర కర్ణ చలనచిత్రం లోని నందమూరితారక రామారావుగారి స్వర విన్యాసం పదాలలో...)
(సుయోధనుడు మయ సభాప్రవేశం కాగానే ఒక పుష్పమాలిక గాలిలో తేలుతూ వచ్చి కురురాజు మెడలో వాలుతుంది)
అహో......! అమ్లానభావ సంభావితమైనె ఈ దివ్య ప్రసూనమాలికారాజమును, కురుసింహుని గళసీమను అలంకరించినవారెవ్వరు?
ఊఁ... (నవ్వుతూ) అనిమిషయామినీ అతిథి సత్కార దివ్య సేవా ప్రభావమౌనా....ఔ...ఔ....(ఇంతలోనే పుష్పమాల అదృశ్యమౌ తుంది ఇట్టి మాయను చూసి ధుర్యోధనుడు నవ్వుకుంటూ ముందుకువెళతాడు. ఇంతలో ఎవరో పిలచినట్టుగా అనిపిస్తుంది). ఏమా సుస్వరము? కాకనీకల కంఠకంఠ కుహుకుహూకార సుతిహిత దివ్యసురకామినీయక సుస్వాగతమౌనా? (యెవరూ లేకుండానే పుష్పవర్షం కురుస్తుంది. కురురాజు సంతోషిస్తూ)సొబగు.....సొబగు....సొబగు.....సొబగు.... (ఆని ముందుకు అడుగులువేస్తాడు. అక్కడ యే ఆధారమూ లేకుండగానే గాలిలో వ్రేళ్ళాడుతున్న ఒక రాయిని చూచి పరీక్షించి)ఔరా..... ఇది శాస్త్ర విజ్ఞానప్రభావమౌనా..... ఔ....ఔ....(అంటూ అచటి నుండి నిష్క్రమిస్తాడు. అక్కడ నర్తకీ మణులు తనతో నాట్యం చేస్తున్నట్టుగా అనిపించి తానూ నాట్యం చేస్తాడు. కాని తాను ఒక్కడే నాట్యం చేస్తున్నడని గ్రహించి).
అయ్యారే...భ్రమ...కించిత్ మధుపానాశక్తమైయున్న మా చిత్తభ్రమ........భళా.... సముచితసత్కారస్వీకార సంతృప్త స్వాంతుడగు ఈ కురుభూకాంతుని సంభావనాసంభాషణా భూషణములచే... ఈ సభాభవనము ధన్యము.... ధన్యము.... అకుంఠిత నిర్మాణ చాతురీ ధురీణుడవగు ఓ మయబ్రహ్మ... నీ శిల్ప చాతురీ మధురిమ ఆబ్రహ్మకుగానీ....విశ్వబ్రహ్మకుగాని లేదు....లేదు....లేదు.... (ఇంతలో తాను పాండవుల నిర్మాణ కర్తను ప్రసంసిస్తున్నానని గుర్తొచ్చి)
ఊఁ......లేవచ్చును...లేకపోవచ్చును. కానీ పాండవ హతకులకిట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమైన మాబోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరావినిత శాశ్వత మహైశ్వర్యమహేశ్వరులము కావచ్చు. అఖిల నదీనదవారిదరగరభూర్గుత అనర్ఘముక్తామణీ విలాసంబులు మాకుండినవుండవచ్చును. సాగరమేఖలాసద్దీ కరగ్రహణమొనర్చి సార్వభౌమత్వపదమ్మందిన అందవచ్చు కానీ.....ఇట్టి సభాభవనం మాకులేకపోవుటమోపలేని లొపం. శతృ కృతాపచారములకంటే, శతృ వైభవము శక్తిమంతుల హృదయములకు దావానల సదృశము. ఊఁ.... ఇక నేనిందుండరాదు.(అనుకుని యెదురుగాకనిపించిన ద్వారం వైపునడుస్తాడు. కాని అది ద్వారం కాదు గోడ. గోడని గుద్దుకొని ఉక్రోషంతో...).
ఎమీ ...... నిరాఘాట పథుడనగు నాకీ కవాట ఘట్టనమా? (అది ద్వారం కాదు గోడ మీద చిత్రం అని గ్రహించి, తన భ్రమకు సిగ్గుపడి...యెవరైనా పరికించారేమో అని చుట్టూ పరికించి,) పరులెవ్వరూ లేరుకద?... మా భంగపాటును పరికించలేదుకద...నిస్సీ..... ఈ మయసభ మాకు విడిది పట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మవమానించుటకే... ఊఁ (వేరొక ద్వారం వైపు వెళుతూ సభా మద్యన ఉన్న జలాశయమును చూచి) ఏమీ.... సభాభవన గర్భమున సుందర జలచర సంచితయై జలాసయమా?(అని కాలు నీటిలో పెడతాడు. అది నీరుకాదని గ్రహించి, )
ఊఁ...... అంతయు మాయామోహితముగానున్నదే ...(అనుకొని ఆ నిర్మిత జలాశయం మీదనుండి నడుచుకుని వెళ్ళి, అక్కడ మరొక జలాశయం ఉండటం చూచి, ..) ఇదియునూ అట్టిదియే .. (అంటూ దాని మీదుగా నడువ యత్నించి, అది నిజమైన జలాశయం అవటంతో కాలు తడబడి, చతికిల పడతాడు. ఆ దృశ్యాలు చూచిన పరిచారికా పరివృతయైన ద్రౌపది మరియు ఆమె పరిచారికలు నవ్వుఆపుకోలేక పగులబడి నవ్వుతారు. అది విని ధుర్యోధనుడు అవమానభారంతో, తొట్రుపాటుతో ఎవ్వరని చూస్తాడు. అక్కడ ద్రౌపది కనిపిస్తుంది. ) పాంచాలీ.... పంచ భర్తృక (అని అవమాన భారంతో అంటాడు. ఇంతలో భీమసేనుడు పొడివస్త్రములు తీసుకుని వస్తాడు.).